జిల్లాలో కరోనా పాజిటివ్ వివరాలు
ABN , First Publish Date - 2020-08-11T09:30:02+05:30 IST
మచిలీపట్నం డివిజన్లో సోమవారం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమో దైనట్లు ఆర్డ్డీవో ఖాజావలి తెలిపారు.

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : మచిలీపట్నం డివిజన్లో సోమవారం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమో దైనట్లు ఆర్డ్డీవో ఖాజావలి తెలిపారు. చల్లపల్లి, మోపిదేవి, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి, మల్లపరాజుగూడెంలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆయన తెలిపారు.
పెడన: పట్టణంలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14వ వార్డుకు చెందిన ఒకరికి, 12వ వార్డుకు చెందిన ఒక వ్యక్తికి, 17వ వార్డుకు చెందిన ఒకరికి, 22వ వార్డుకు చెందిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకింది.
చల్లపల్లి : చల్లపల్లిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దంత వైద్యశాలలో పనిచేసే యువతికి, రామానగరంలో ఉంటున్న రేపల్లె బ్యాంకు ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కలిదిండి : మూల్లంకలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైందని పీహెచ్సీ వైద్యాధికారి శిరీష తెలిపారు. తిరువూరు : పట్టణంలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తహసీల్దార్ నరసింహారావు తెలిపారు.
పమిడిముక్కల : మండలంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి పద్మజ తెలిపారు. వీరంకి గ్రామానికి చెందిన ఐదుగురు, మేడూరు గ్రామానికి చెందిన ఒక్కరు వైర్స బారిన పడ్డారన్నారు.
కైకలూరు: మండలంలో కొత్తగా నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు శీతనపల్లి పీహెచ్సీ వెద్యాధికారిణి బి.హేమలత తెలిపారు. కైకలూరులో మూడు, ఆటపాకలో ఒకటి వచ్చాయన్నారు.
నూజివీడు : నూజివీడు నియోజకవర్గం పరిధిలోని నూజివీడు, రూరల్ మండలం, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లో సోమవారం 42 కరోనా కేసులు నమోదయ్యాయి. నూజివీడు పట్టణంలో 24, మండలంలోని తుక్కులూరులో 5, మీర్జాపురం 2, మొర్సపూడి 2, రాట్నాలగూడెం 1, ఆగిరిపల్లి మండలంలో 4, ముసునూరు మండలంలో 1, చాట్రాయి పోలీస్ స్టేషన్లో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. విస్సన్నపేట మండలంలోని పుట్రేలలో 4, తెల్లదేవరపల్లిలో ఒక కేసు నమోదయ్యాయి.