విజయవాడ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం.. పూర్తి స్థాయిలో..

ABN , First Publish Date - 2020-06-25T17:22:24+05:30 IST

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం లాక్‌డౌన్‌లో చారిత్రాత్మక అడుగు వేసింది! విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయి కార్గో విమాన సేవలు ప్రారంభమయ్యాయి.

విజయవాడ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం.. పూర్తి స్థాయిలో..

విజయవాడ విమానాశ్రయంలో కార్గో ఫ్లైట్‌ సేవలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం లాక్‌డౌన్‌లో చారిత్రాత్మక అడుగు వేసింది! విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయి కార్గో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ పూర్తిస్థాయి తొలి కార్గో విమా నాన్ని నడుపుతోంది. నాన్‌స్టాప్‌గా నెలల తరబడి ఈ విమానం నడుస్తోంది. గాయత్రీ హేచరీస్‌ సంస్థ ప్రాన్‌ ష్ర్పింక్స్‌ (రొయ్యల సీడ్‌)ను దేశంలో వివిఽధ నగరాలకు ఎగుమతి చేస్తోంది. లాక్‌డౌన్‌ ముందు ఈ సంస్థ హైదరా బాద్‌కు రోడ్డు రవాణా ద్వారా తరలించి అక్కడి నుంచి విమా నాలలో తరలించేది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఈ సీడ్‌ను సేకరించి దేశంలోని పలు నగరాలకు ఎగుమతి  చేస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల రోడ్డు రవాణాకు ఆటంకా లేర్పడటం, రొయ్య ల సీడ్‌ పాడై పోవటం వల్ల ఆ సంస్థకు ఇబ్బం దులెదురయ్యాయి. విజయవాడ నుంచే నేరుగా ప్రాన్‌ ష్ర్పింక్స్‌ను తరలించాలని సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్‌ నెలలో స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ప్రత్యేక కార్గో విమానాన్ని విజయవాడ పంపించింది.  


 రొయ్యల సీడ్‌ ఎగుమతి ఇలా..

ప్రతి ఏడాదిలో రోయ్యల సీడ్‌ అనేది జనవరి నుంచి ఆగస్టు, సెప్టెంబరు నెలల వరకు ఉత్పత్తి జరుగుతుంది. ఈ సీజన్‌లో గాయత్రీ హేచరీస్‌ సంస్థ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలోని రొయ్యల చెరువులు, సీడ్‌ ప్రొడక్షన్‌ ఏరియాల నుంచి ప్రాన్‌ ష్ర్పింక్స్‌ను సేకరిస్తోంది. ఇవి నీటిలో ఈదటానికి సిద్ధంగా ఉండే అతి చిన్న పిల్ల రొయ్యలు. వీటికి దేశవ్యాప్తంగా ఆక్వా పెంపకందారుల నుంచి డిమాండ్‌ ఉంటుంది.  ఈ జిల్లాల్లో మేలుజాతి రొయ్యల ప్రొడక్షన్‌ ఉంటుందన్న ఉద్దేశంతో ఉత్తరాది రాష్ర్టాల నుంచి కూడా భారీగా డిమాండ్‌ ఉంటుంది. మే, జూన్‌ నెలల్లో దాదాపుగా ప్రతిరోజూ రొయ్యల సీడ్‌ ఎగుమతి అవుతుంది. ప్రతి రోజూ సగటున 3-4 మెట్రిక్‌ టన్నుల మేర ఎగుమతులుంటాయి. జూన్‌ నెలలో సగటున 10 టన్నుల మేర ఎగుమతులు చేయటం గమనార్హం. ప్రత్యేక కార్గో ఎక్స్‌ప్రెస్‌ కెపాసిటీ 25 టన్నులు ఉంటుంది. ఆగస్టు నాటికి ఈ ఎగుమతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. విజయవాడ  నుంచి సూరత్‌, ముంబాయి, ఢిల్లీలకు వీటిని సంస్థ స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌ తరలిస్తోంది. 


వ్యాపారులు, రైతులు ఉపయోగించుకోవచ్చు 

ఇది మంచి అవకాశం. అందుబాటు ధరలలో ఎయిర్‌ కార్గో రవాణా అన్నది విజయవాడకు అందుబాటులోకి వచ్చింది. కోస్తా జిల్లాల్లోని వ్యాపారులు, రైతులు ఈ అవకాశాన్ని ఉపయో గించుకుని దేశ వ్యాప్తంగా తమ ఉత్పత్తులను మంచి మార్కెట్‌ చేసుకోవచ్చు. చేపలు, ధాన్యాలు, తయారీ ఉత్పత్తులు, ఉద్యాన పంటలు, ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా దేశ వ్యాప్తంగా మార్కెట్‌ చేసుకుని ఈజీగా రవాణా చేసుకోవచ్చు. రైతులు కొద్దిగా అవగాహన ఏర్పాటుచేసుకుంటే.. దేశంలో మంచి మార్కెట్‌ ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడికి ఎయిర్‌ కార్గో ద్వారా తేలిగ్గా రవాణా చేసుకుని లాభపడవచ్చు. విమానాశ్రయం అనగానే ఇదేదో ఖరీదైన వ్యవ హారమని, మనకేమీ తెలియదని చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. లాజిస్టిక్‌ టెర్మినల్‌కు వస్తే మంచి  అవగాహన కూడా కల్పించటం జరుగుతుంది. అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. గాయత్రీ హేచరీస్‌ మాదిరిగానే మిగిలిన సంస్థలు కూడాఎంతో ప్రయోజనం పొందవచ్చు. 

-జీ మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ 

Updated Date - 2020-06-25T17:22:24+05:30 IST