అమరావతే రాజధాని అని సీఎం ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-06-23T09:19:11+05:30 IST

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని సీఎం జగన్మోహన్‌రెడ్డి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరు ఆగదని ..

అమరావతే రాజధాని అని సీఎం ప్రకటించాలి

 188వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతుల డిమాండ్‌ 


గుంటూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని సీఎం జగన్మోహన్‌రెడ్డి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరు ఆగదని ఆ ప్రాంత రైతులు, కూలీలు, మహిళలు చెప్పారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారం 188వ రోజుకు చేరాయి. దివంగత కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ భవనాల సముదాయం ప్రాంతంలో దళిత జేఏసీ నేత చిలక బసవయ్య, మైనార్టీ నేత షేక్‌ సాహెబ్‌జాన్‌లు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చిత్రపటాలతో నిరసన తెలిపారు. ఆ ప్రాంతంలోని పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు.


అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానం ప్రతిపాదించి.. ప్రస్తుతానికి రాజధాని తరలించటం లేదని మంత్రులతో చెప్పించడంలో ఆంతర్యం ఏమిటంటూ నిలదీశారు. అమరావతిని శ్మశానం అన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఆ శ్మశానంలోకి ఏం చూడటానికి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెరిగ మరియదాసు, మీర్జా బాజీ, కంభంపాటి వెంకటేశ్వరరావు, చిలకా విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. ‘ఇంటిటా అమరావతి’ కార్యక్రమం కింద వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. అమరావతి వెలుగు కార్యక్రమం చేపట్టారు. 

Read more