నివర్ తుఫాను కారణంగా రైళ్ల రద్దు, మళ్లింపు
ABN , First Publish Date - 2020-11-26T06:20:42+05:30 IST
నివర్ తుఫాను కారణంగా రైళ్ల రద్దు, మళ్లింపు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : నివర్ తుఫాను కారణంగా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటినీ దారి మళ్లించారు. విజయవాడ మీదుగా గురువారం నడిచే చెన్నై సెంట్రల్- సంత్రాగచి (నెంబర్ 02808), చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య నడిచే రైలు (నెంబరు 06057), తిరుపతి - చెన్నై మధ్య నడిచే రైలు (నెంబర్ 06008) రద్దు చేశారు. పుదుచ్చేరి-హౌరా (నెంబర్ 02868), బెంగళూరు -దానాపూర్ (నెంబర్ 02295), బెంగళూరు-గువహటి (నెంబర్ 01509), తిరువనంతపురం-గోరఖ్‌పూర్ (నెంబర్ 03210)ను పాక్షికంగా మళ్లించినట్టు ప్రకటించారు. అలాగే, బెంగళూరు-హౌరా పార్శిల్ రైలును కూడా మేల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా మళ్లించారు. తుఫాను నేపథ్యంలో విజయవాడలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 0866-2767239 నెంబర్‌కు కాల్ చేసి సహాయాన్ని పొందవచ్చు.