హిమబిందు ఐ కేన్సర్ సెంటర్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-13T11:33:07+05:30 IST
తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని కోడె వెంకటాద్రి చౌదరి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హిమబిందు యలమంచిలి సెంటర్ ఫర్ ఐ కేన్సర్‌ను గురువారం ప్రారంభించారు.
పెనమలూరు, నవంబరు 12 : తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని కోడె వెంకటాద్రి చౌదరి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హిమబిందు యలమంచిలి సెంటర్ ఫర్ ఐ కేన్సర్‌ను గురువారం ప్రారంభించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ కేన్సర్ సెంటర్‌కు ఆర్థిక మద్దతు ఇచ్చిన అమెరికాకు చెందిన రత్న తులసీ, డాక్టర్ బసవేశ్వరరావు యలమంచిలిలకు ఏపీ ప్రభుత్వం, ప్రజల తరఫున అభినందనలు తెలిపారు. అమెరికాలో ఉంటూ రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలందించడానికి ముందుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.