-
-
Home » Andhra Pradesh » Krishna » bza news
-
రాజధానుల పేర నాటకం
ABN , First Publish Date - 2020-10-31T08:26:57+05:30 IST
మూడు రాజధానులంటూ ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి నాటకమాడిస్తోందనిరాజధాని రైతులు మండిపడ్డారు. రాజధాని అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు

అమరావతిలోని ఐదు వేల ఇళ్ల పంపిణీ ఎప్పుడు?
318వ రోజు నిరసన దీక్షల్లో రాజధాని రైతుల ఆగ్రహం
ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్, అక్టోబరు 30 : మూడు రాజధానులంటూ ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి నాటకమాడిస్తోందనిరాజధాని రైతులు మండిపడ్డారు. రాజధాని అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 318వ రోజుకు చేరుకుంది. రాయపూడి శిబిరంలో దళిత మహిళా జేఏసీ సభ్యురాలు కంభంపాటి శిరీష, సభ్యుడు చిలకా బసవయ్య మాట్లాడుతూ రాజధానిలో పేదలకు స్థలాలు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే అమరావతిని అభివృద్ధి చేయకుండా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై జగన్, ఆయన మంత్రులు నాటకాలు ఆపాలన్నారు. అమరావతిలో గతంలో కట్టిన ఐదు వేల ఇళ్లను పేదలకు ఎందుకు పంపిణీ చేయలేదన్నారు.
తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నీరుకొండ, బేతపూడి, తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళల నిరసనలు శుక్రవారం కూడా కొనసాగాయి.