ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల డేటా 31లోగా సేకరించండి

ABN , First Publish Date - 2020-10-28T10:19:52+05:30 IST

జిల్లాలోని హెల్త్‌కేర్‌ వర్కర్లకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు ఈ నెల 31లోగా డేటా సేకరించాలని వైద్యాఽధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల డేటా 31లోగా సేకరించండి

 వైద్యాధికారులకు కలెక్టర్‌ ఆదేశం


విజయవాడ సిటీ : జిల్లాలోని హెల్త్‌కేర్‌ వర్కర్లకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు ఈ నెల 31లోగా డేటా సేకరించాలని వైద్యాఽధికారులను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో వీఎంసీ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌తో కలిసి వైద్యాధికారులతో కలెక్టర్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ఉన్న హెల్త్‌కేర్‌ వర్కర్లకు తొలిదశ వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందన్నారు. జిల్లాలో 110 ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు ఉన్నాయని, 1000 వరకు ప్రైవేట్‌ ఆసుపత్రులు, వైద్యకళాశాలు, 58 వరకు ఆయుష్‌ వైద్య సంస్థలు ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు కలిగిన ఐసీడీఎస్‌ శాఖ కూడా తొలి వ్యాక్సినేషన్‌లోనే ఉందన్నారు.


జిల్లా ఇమ్యూనేషన్‌ అధికారి డాక్టర్‌ శర్మిష్ట మాట్లాడుతూ రైల్వే, ఆర్టీసీ, ఈఎస్‌ఐ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి డేటాను కేంద్ర ప్రభుత్వం నేరుగా సేకరిస్తోందన్నారు.డీఎంహెచ్‌వో డాక్టర్‌.సుహాసిని, అడిషనల్‌ డీఎంహెచ్‌వో జె.ఉషారాణి, డబ్ల్యూహెచ్‌వో ఆర్‌ఎంవో డి.హర్షిత్‌, నగర వైద్యాధికారి సురేష్‌బాబు, ఆయుష్‌ ఆర్‌డీడీ కె.ప్రసాదరావు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కె.శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T10:19:52+05:30 IST