కదిలిన స్పెషల్స్‌

ABN , First Publish Date - 2020-10-27T09:59:23+05:30 IST

పండగ ముందు స్పెషల్‌ బస్సులను బయటకు తీయలేని ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ పండగ తర్వాత తిరుగు ప్రయాణాల సందర్భంగా బయటకు తీసింది.

కదిలిన స్పెషల్స్‌

 (ఆంధ్రజ్యోతి, విజయవాడ):పండగ ముందు స్పెషల్‌ బస్సులను బయటకు తీయలేని ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ పండగ తర్వాత తిరుగు ప్రయాణాల సందర్భంగా బయటకు తీసింది. సోమవారం సాయంత్రం వరకు విశాఖపట్నం, రాజమండ్రి మార్గంలో 40 స్పెషల్స్‌ను ఆర్టీసీ అధికారులు నడిపారు. రెగ్యులర్‌ బస్సులు కిటకిటలాడడంతో స్పెషల్‌ బస్సులను బయటకు తీశారు. తిరుగు ప్రయాణాల్లో పండగ రద్దీ కనిపించటం విశేషం. రెండు రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టులైన గరికపాడు, కల్లూరుల వరకు ఆర్టీసీ అధికారులు పండగ రోజున 20 షటిల్‌ బస్సులు నడపగా, సోమవారం 50 షటిల్‌ బస్సులను నడిపారు. 

Updated Date - 2020-10-27T09:59:23+05:30 IST