వైసీపీ పతనం ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-13T11:13:08+05:30 IST

అమరావతి రైతులకు న్యాయం చేయాలన్నదే జనసేన విధానమని, మూడు రాజఽధానుల ప్రకటనతోనే పైసీపీ పతనం ప్రారంభమైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్‌ అన్నారు.

వైసీపీ పతనం ప్రారంభం

విజయవాడ సిటీ : అమరావతి రైతులకు న్యాయం చేయాలన్నదే జనసేన విధానమని, మూడు రాజఽధానుల ప్రకటనతోనే పైసీపీ పతనం ప్రారంభమైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్‌ అన్నారు. రాజధాని రైతులకు సంఘీభావంగా సోమవారం స్థానిక ధర్నాచౌక్‌లో జనసేన ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నారు.


అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతితోనే ముడిపడిందన్నారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మహిళా జేఏసీ నాయకులు సుంకర పద్మశ్రీ, అక్కినేని వనజ, పెనుమత్స దుర్గాభవానీ, మాలతి, హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌, సినీనటి దివ్యవాణి, జనసేన నేత ఆలమూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-13T11:13:08+05:30 IST