వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

ABN , First Publish Date - 2020-10-03T11:30:03+05:30 IST

కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, వాటిని రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

విజయవాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, వాటిని రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది. గాంధీ జయంతి సందర్భంగా వన్‌టౌన్‌లోని మహాత్ముడి విగ్రహం వద్ద నివాళులర్పించిన నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ గంగాధర్‌, నరహరిశెట్టి నరసింహారావు, పీవై కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T11:30:03+05:30 IST