అజయ్‌ మృతదేహానికి పోస్టుమార్టం

ABN , First Publish Date - 2020-10-03T11:26:57+05:30 IST

ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన డి.అజయ్‌ మృతదేహానికి రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రభుత్వాసుపత్రి మార్చురీలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు.

అజయ్‌ మృతదేహానికి పోస్టుమార్టం

విజయవాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన డి.అజయ్‌ మృతదేహానికి రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రభుత్వాసుపత్రి మార్చురీలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు కూడా మార్చురీ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం నుంచి అజయ్‌ కుటుంబానికి సాయం అందించేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్‌ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, రాజీవ్‌ రతన్‌ తదితర నాయకులు ఆస్పత్రి వద్ద అజయ్‌ తల్లిని పరామర్శించి ఓదార్చారు.

Updated Date - 2020-10-03T11:26:57+05:30 IST