అంగన్‌వాడీ కేంద్రాలకు

ABN , First Publish Date - 2020-09-29T10:18:12+05:30 IST

జిల్లాలోని సొంత భవనాలున్న 1632 అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు విడతల్లో మరమ్మతులు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమశాఖ పీడీ, ఇన్‌ఛార్జ్‌ ఆర్‌.జె.డి పి

అంగన్‌వాడీ కేంద్రాలకు

రెండు విడతల్లో మరమ్మతులు

 స్ర్తీ, శిశు సంక్షేమశాఖ పీడీ ఉషారాణి

కూచిపూడి, సెప్టెంబరు 28 : జిల్లాలోని సొంత భవనాలున్న 1632 అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు విడతల్లో మరమ్మతులు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమశాఖ పీడీ, ఇన్‌ఛార్జ్‌ ఆర్‌.జె.డి పి.ఉషారాణి తెలిపారు. సోమవారం మొవ్వ ఐసీడీఎస్‌ కార్యా లయాన్ని సందర్శించిన ఆమె సీడీపీవో భానుమతితో కలసి విలేకరులతో మాట్లాడారు. 1342 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నట్లు తెలిపారు.


వైఎస్సాఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 27,421 మంది గర్భవతులు, 21,522 మంది బాలింతలు, 6 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు లక్షా 8 వేల 118 మంది, 3 నుండి ఆరేళ్లలోపు ఫ్రీ స్కూల్‌ పిల్లలు 59,408 మంది పౌష్టికాహారం పొందుతున్నట్లు తెలిపారు. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు బాల్యవివాహాలు, బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మహిళా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-09-29T10:18:12+05:30 IST