క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే రాజన్న రాజ్యమా?
ABN , First Publish Date - 2020-12-01T06:05:18+05:30 IST
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజలు, రైతుల బాధలను తెలుసుకున్నప్పుడే రాజన్న రాజ్యమౌతుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

మండలి బుద్ధప్రసాద్
నాగాయలంక, నవంబరు 30 : ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజలు, రైతుల బాధలను తెలుసుకున్నప్పుడే రాజన్న రాజ్యమౌతుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సీఎం ఏరియల్ సర్వే చేస్తే అది రాజన్న రాజ్యం అన్పించుకోదన్నారు. మండలంలోని కమ్మనమోలు గ్రామంలో సోమవారం ముంపు బారిన వరి పంటలను పరిశీలించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మండవ బాలవర్థిరావు, మెండు లక్ష్మణరావు, మండలి ఉదయభాస్కర్, ఉప్పల ప్రసాద్, తిరుమలశెట్టి మస్తానరావు, విశ్వనాథపల్లి భిక్షం పాల్గొన్నారు.