బుద్దా వెంకన్నకు దేవినేని ఉమ, టీడీపీ నేతల పరామర్శ

ABN , First Publish Date - 2020-03-13T10:45:59+05:30 IST

మాచెర్ల ఘటనలో గాయాలపాలైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను గురువారం రాత్రి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు.

బుద్దా వెంకన్నకు దేవినేని ఉమ, టీడీపీ నేతల పరామర్శ

విజయవాడ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : మాచెర్ల ఘటనలో గాయాలపాలైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను గురువారం రాత్రి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. బుద్దా వెంకన్న ఇంటికి వెళ్లిన టీడీపీ నాయకులకు మాచెర్లలో తమపై జరిగిన దాడి గురించి వెంకన్న వారికి వివరించారు. టీడీపీ నాయకులు ఉమ్మడి వెంకటేశ్వరరావు, సాధార బోయిన ఏడుకొండలు, దేవరాజు, అంగడిమణి కిషోర్‌, కర్రీ కిరణ్‌ కుమార్‌, వికాస్‌ జైన్‌, కొప్పుల గంగాధర్‌రెడ్డి, ఈగల సాంబ, మల్లిబాబులు తదితరులు బుద్దాను పరామర్శించిన వారిలో ఉన్నారు. 

                                                       

                                    

Updated Date - 2020-03-13T10:45:59+05:30 IST