-
-
Home » Andhra Pradesh » Krishna » bonus cheques distribution
-
పాడిరైతుల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2020-12-27T05:47:43+05:30 IST
పాడిరైతుల సంక్షేమానికి కృషి

తిరువూరు, డిసెంబరు 26: పాడిరైతుల సంక్షేమం కోసం కృష్ణా మిల్క్ యూనియన్ కృషి చేస్తోందని, యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. శనివారం లక్ష్మీపురంలోని పాలశీతల కేంద్రం వద్ద పాడిరైతులకు బోనస్ చెక్కులను ఆయన అందజేశారు. సుమంగళి, కృష్ణా క్షీరబంధు, విద్యా దీవెన పథకాలను, సబ్సిడీపై అందజేస్తున్న మందులు, దాణా, మినరల్ మిక్చర్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిల్క్ యూనియన్ ఎండీ ఈశ్వరబాబు, జీఎం అనిల్‌కుమార్, ఉదయ్‌కిరణ్ పాల్గొన్నారు.