8న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి : వడ్డే

ABN , First Publish Date - 2020-12-06T06:03:40+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ ప్రవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత్‌ రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈనెల 8న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు ఆల్‌ ఇండియా కిసాన్‌ కో- ఆర్డ్డినేషన్‌ కమిటీ ఏపీ చైర్మన్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు.

8న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి : వడ్డే

విజయవాడ సిటీ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ ప్రవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత్‌ రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈనెల 8న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు ఆల్‌ ఇండియా కిసాన్‌ కో- ఆర్డ్డినేషన్‌ కమిటీ ఏపీ చైర్మన్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాలు ఈ బంద్‌లో భాగస్వాములు కా వాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేందర్‌, ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.కేశవ రావు, సూర్యనారాయణ ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ రైతుసంఘం రాష్ట్ర సహాయకార్యదర్శి ఎం.యల్లామందారావు, రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకుడు వీరబాబు, ఏపీ కిసాన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.హరనాథ్‌, రైతుకూలీ సంఘం నాయకుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read more