బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు కొనసాగించాలని ధర్నా
ABN , First Publish Date - 2020-12-01T06:05:14+05:30 IST
స్ట్ అవైలబుల్ పాఠశాలలను కొనసాగించాలని కోరుతూ దళిత నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్ధార్ కె.స్వర్ణమేరికి వినతిపత్రం అందజేశారు.
చల్లపల్లి : బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను కొనసాగించాలని కోరుతూ దళిత నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్ధార్ కె.స్వర్ణమేరికి వినతిపత్రం అందజేశారు. దళిత విద్యా ర్థులకు కార్పొరేట్ విద్యను, హాస్టల్ వసతి సౌకర్యాన్ని దూరం చేసేలా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకాన్ని తొలగించటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను కొనసాగించాలని జోజికుమారి కన్నీటి పర్యంతమై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మాచవరపు ఆదినారాయణ, సిహెచ్.సుధీర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.