ఈ-క్రాప్‌తోనే రైతుకు ప్రయోజనాలు

ABN , First Publish Date - 2020-07-19T10:20:39+05:30 IST

జిల్లాలో వివిధ పంటలు సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. ఈ-క్రాప్‌లో నమోదైన పంటలకే ప్రభుత్వ

ఈ-క్రాప్‌తోనే రైతుకు ప్రయోజనాలు

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : జిల్లాలో వివిధ పంటలు సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. ఈ-క్రాప్‌లో నమోదైన పంటలకే ప్రభుత్వ సబ్సిడీ, రాయితీలు అందనున్నాయి. ఆగస్టు 31 వరకు ఈ నమోదు జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది నేరుగా పొలం వద్దకు వెళ్లి రైతులు ఏ రకం పంటలను సాగుచేస్తున్నారు, సర్వే నెంబరు, సొంతమా, కౌలు భూమి తదితర వివరాలతోపాటు, రైతులను పొలం వద్ద నిల బెట్టి ఫొటోలు తీసుకుంటారు.


ఈ వివరాలను  ఈ-క్రాప్‌లో నమోదు చేస్తారు. వర్షాలు కురుస్తుండటంతో వరి, పత్తి, తదితర పంటలసాగు ఊపందుకుంది. జిల్లాలో ఆరు లక్షల మంది రైతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు,  పంట రుణాలు, వడ్డీరాయితీ, పంటల బీమా,  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు భరోసా, పంట నష్టపరిహారం,  ధాన్యం కొనుగోళ్లు, ఇతరత్రా ప్రయోజనాలు పొందా లంటే రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలు ఈ-క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయా ల్సిందే. 10సెంట్లకంటే అధికంగా సాగు ఉంటేనే  దీనిలో నమోదు చేస్తారు.


ఈనెల 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు పంటసాగు పత్రాల జారీ కార్యక్రమం చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ టి.మోహనరావు తెలిపారు. ప్రతి రోజూ రైతు భరోసా కేంద్రాల వద్ద వ్యవసాయ అనుబంధ శాఖల ఉద్యోగులు, బ్యాంకు అధి కారులు సమావేశం నిర్వహిస్తారు. రైతులు పంట రుణాలు తీసుకున్నారా,  ఇంకా ఎంత మందికి అందాలి, కిసాన్‌ క్రెడిట్‌కార్డులంది స్తారు. కౌలు రైతులకు పంటరుణాలు మంజూరు ఇతర అంశాలపై  అవగాహనతో పాటు పంటసాగు పత్రాలను అందజేస్తారు.  

Updated Date - 2020-07-19T10:20:39+05:30 IST