బీసీలకు సంకటరాత్రి

ABN , First Publish Date - 2020-12-19T06:16:55+05:30 IST

బీసీలకు సంకటరాత్రి

బీసీలకు సంకటరాత్రి

విద్యాధరపురం, డిసెంబరు 18 : నగరంలో ముఖ్యమంత్రి జగన్మోహ నరెడ్డి నిర్వహించిన బీసీ సంక్రాంతి కాదని.. బీసీలకు సంకట రాత్రి అని, కార్యక్రమంలో సరైన భోజనం పెట్టలేని ముఖ్యమంత్రి  బీసీలను ఏదో ఉద్దరిస్తాననడం అవివేకమని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సింహాద్రి కనకాచారి, జాతీయ ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. శుక్రవారం ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను ప్రస్తుత సీఎం జగన్‌ నవ రత్నాలకు మళ్లించారన్నారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని జగన్‌ రెడ్డిని ప్రసన్నం చేసుకుని రాబోయే రోజుల్లో తమ మంత్రి పదవు లు కాపాడుకోవటానికి సిగ్గు, లజ్జా లేకుండా దిగజారిపోయి మాట్లాడు తున్నారని వారికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదన్నారు.

Read more