బ్యాంకుల సహకారంతోనే పథకాలు

ABN , First Publish Date - 2020-12-25T06:25:01+05:30 IST

బ్యాంకుల సహకారంతోనే పథకాలు

బ్యాంకుల సహకారంతోనే పథకాలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌

విజయవాడ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకుల సహకారంతోనే ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయగలుగుతున్నామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌ బీమా, జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత తదితర కార్యక్రమాలు జిల్లాలో ఎంతో సమర్థవంతంగా అమలవుతున్నాయన్నారు. లయోల కళాశాలలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశం గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారులకు పథకాలు అందించే విషయంలో భాగంగా జిల్లాలోని పలుచోట్ల పారిశుధ్య కార్మికులు చెత్త వేసిన ఘటనలు బాధాకరమని, వాటిని పునరావృత్తం కాకుండా చూస్తానన్నారు. 

‘జగనన్న తోడు’లో జిల్లా అగ్రస్థానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన జగనన్న తోడు పథకం అమలులో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందులో బ్యాంకర్ల కృషి ఎంతో ఉందని కలెక్టర్‌ కొనియాడారు. జిల్లాలో 33,866 మంది లబ్ధిదారులకు జగనన్న తోడు అమలు చేసేందుకు బ్యాంకులు నిర్ణయించాయన్నారు. ఇప్పటికే 14,935 మంది లబ్ధిదారులకు రుణాలు అందజేశామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. 

ప్రభుత్వ పథకాల అమలుకు సహకరించండి : కలెక్టర్‌

వైఎస్సార్‌ బీమా పథకం కింద 12.5 లక్షల బియ్యంకార్డులు ఉంటే ఇప్పటి వరకు కేవలం పదిశాతం మందికే బీమా కల్పించారని కలెక్టర్‌ ఇంతియాజ్‌ బ్యాంకర్లపై ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఆంధ్ర బ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రమాదాలు, మరణాలు సంభవించినప్పుడు పేదలకు బీమా మొత్తం అందించాలన్న ధ్యేయంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించామన్నారు. అయితే, 12.56 లక్షల మంది బియ్యంకార్డు దారుల్లో కనీసం పది లక్షల మందినైనా బీమా కిందకు తీసుకురావాల్సి ఉందన్నారు. బ్యాంకు అధికారులు స్పందించాలని ఆయన కోరారు. జేసీ (ఆసరా) కె.మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ బీమా పథకం ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా అధికారుల లెక్కల్లో పురోగతి ఆశించిన మేరకు లేదన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2020-12-25T06:25:01+05:30 IST