సింగపూర్‌ నుంచి వచ్చిన యువతి ఆసుపత్రికి

ABN , First Publish Date - 2020-03-27T09:01:22+05:30 IST

బందరు డివిజన్‌లో తాజాగా నిర్వహించిన సర్వేలో 110 మంది విదేశాల నుంచి వచ్చినట్లు తేలిందని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాంజీనాయక్‌, ఆర్‌ఎంవో మల్లిఖార్జునరావు తెలిపారు.

సింగపూర్‌ నుంచి వచ్చిన యువతి  ఆసుపత్రికి

మచిలీపట్నం టౌన్‌, మార్చి 26 : బందరు డివిజన్‌లో తాజాగా నిర్వహించిన సర్వేలో 110 మంది విదేశాల నుంచి వచ్చినట్లు  తేలిందని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాంజీనాయక్‌, ఆర్‌ఎంవో మల్లిఖార్జునరావు తెలిపారు. వీరందరినీ ఇళ్ల వద్దే 14 రోజుల పాటు హౌస్‌ ఐసోలేషన్‌ ఉంచామన్నారు. సింగపూర్‌ నుంచి వచ్చిన ఒక యువతి జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి  క్యారంటైన్‌ వార్డులో చేర్పించామన్నారు.  విదేశాల నుంచి వచ్చిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు బయటకు వస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ, ఇన్‌చార్జి   ఎంపీడీవో జి.వి. సూర్యనారాయణ  హెచ్చరించారు. 


 ఫ ముదినేపల్లి రూరల్‌: ఇటీవల అమెరికా నుంచి ముదినేపల్లి వచ్చిన కరోనా అనుమానితురాలిని వైద్యసిబ్బంది విజయవాడ ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.  వారం రోజులుగా ఇంట్లోనే మహిళ ఉంటున్నట్టు తెలియటంతో మహిళతోపాటు ఆమె భర్తను పరిశీలనలో ఉంచినట్టు తెలిసింది. చిన రామాలయం రెండో బజారులో ఇటీవల మస్కట్‌ నుంచి వచ్చిన మహిళను ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచారు. ఇంటింటి సర్వేలో భాగంగా గ్రామవలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది గురువారం గ్రామాల్లో ముమ్మరంగా సర్వేచేసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నారు. 

Updated Date - 2020-03-27T09:01:22+05:30 IST