‘ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతి’కి డాక్టర్‌ బాబూరావు రూ.10 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-11-25T06:23:10+05:30 IST

‘ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతి’ సంస్థకు ఎన్నారై డాక్టర్‌ బాబూరావు దొడ్డపనేని రూ.10 లక్షలు విరాళమిచ్చారు.

‘ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతి’కి డాక్టర్‌ బాబూరావు రూ.10 లక్షల విరాళం

అమరావతి :  రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అణచివేయాలని చూస్తున్న నేపథ్యంలో అమరావతి రైతులకు పలువురు ఎన్నారైలు, ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి. ఈ క్రమంలోనే అమరావతి రైతులకు మద్దతునిచ్చేందుకు ‘ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతి‘ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని’ అన్న నినాదంతో ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు, ఉద్యమానికి తమ వంతు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ‘ఎన్నారైస్‌ ఫర్‌ అమరావతి’ సంస్థకు ఎన్నారై డాక్టర్‌ బాబూరావు దొడ్డపనేని రూ.10 లక్షలు విరాళమిచ్చారు. స్వతహాగా రైతు కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా ఎదిగిన బాబూరావు, 40 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. రాష్ట్రంపై మీద ఉన్న మమకారంతో రైతులకు తన వంతు సాయం అందించారు. ‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని’ అన్న నినాదానికి బాబూరావు పూర్తి మద్దతు తెలిపారు. తమకు బాసటగా నిలిచిన బాబూరావుకు అమరావతి రాజధాని రైతులు, పలువురు ఎన్నారైలు ధన్యవాదాలు తెలిపారు. 

Read more