అవనిగడ్డలో టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-03-04T08:53:55+05:30 IST

అమరావతి రైతులకు మద్ధతుగా మంగళవారం మండల టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది.

అవనిగడ్డలో టీడీపీ నిరసన

అవనిగడ్డ టౌన్‌, మార్చి 3: అమరావతి రైతులకు మద్ధతుగా మంగళవారం మండల టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. స్థానిక రాజీవ్‌ గాంధీ సెంటర్‌లో నల్లజెండాలు చేపట్టి ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. రైతు కంట కన్నీరు తెప్పించిన ఏ రాజ్యం సుభిక్షంగా లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, బచ్చు రఘునాథ్‌, మెగావతు గోపి, రత్తయ్య, మురళీ మోహన్‌ రావు, శ్రీనివాసరావు, షేక్‌ బాబా వలి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T08:53:55+05:30 IST