-
-
Home » Andhra Pradesh » Krishna » auto workers union darna
-
జీవో 21ని రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-30T06:24:15+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం జీవో 21 రద్దు చేయాలని లేదంటే ఆటో, లారీ, ట్రక్కు, టాక్సీ వంటి మోటారు రంగాలను కలుపుకుని పెద్దఎత్తున ఆందోళనలతో పాటు ఐక్యంగా బంద్‌కు పిలుపునిస్తామని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆలిండియా ఉపాధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ హెచ్చరించారు.

జీవో 21ని రద్దు చేయాలి
విజయవాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం జీవో 21 రద్దు చేయాలని లేదంటే ఆటో, లారీ, ట్రక్కు, టాక్సీ వంటి మోటారు రంగాలను కలుపుకుని పెద్దఎత్తున ఆందోళనలతో పాటు ఐక్యంగా బంద్‌కు పిలుపునిస్తామని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆలిండియా ఉపాధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ హెచ్చరించారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో మంగళవారం ధర్నా జరిగింది. ఏపీ ఆటో అండ్ ట్రక్కు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు, విజయవాడ ఆటోవర్కర్స్ యూనియన్ నాయకుడు బి.రూబెన్‌కుమార్ పాల్గొన్నారు.