రైతుల ఉద్యమానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు
ABN , First Publish Date - 2020-12-07T19:24:16+05:30 IST
రైతుల ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో ఎగుమతులు నిలిపివేయాలని నిర్ణయించింది.

అమరావతి: రైతుల ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో ఎగుమతులు నిలిపివేయాలని నిర్ణయించింది. రేపటి బంద్ సందర్భంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిపివేస్తామని తెలిపింది. కేంద్రం రైతులతో చర్చించి ఉద్యమాన్ని ఉపసంహరింపజేయాలని విజ్ఞప్తి చేసింది. ఏపి లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై. వి. ఈశ్వరరావు సోమవారం నాటి ప్రకటనలో పేర్కొన్నారు.