కార్యాలయాలకు వైసీపీ రంగులపై మరోసారి హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2020-12-01T17:28:11+05:30 IST

పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేయడంపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

కార్యాలయాలకు వైసీపీ రంగులపై  మరోసారి హైకోర్టులో పిటిషన్

అమరావతి: పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రంగులేసి తొలగించినందుకు రూ.4 వేల కోట్లయ్యాయని, వీటిని రాబట్టాలని పిటిషనర్ కోరారు. ఈ రూ.4 వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేశారు. కాగా అఫిడవిట్ సరిగా వేయాలని పిటిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా ఎందుకు చేర్చారని హైకోర్టు ప్రశ్నించారు.

Updated Date - 2020-12-01T17:28:11+05:30 IST