పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి: డీజీపీ గౌతం
ABN , First Publish Date - 2020-10-21T14:50:58+05:30 IST
పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి అని... వారి త్యాగం నుంచీ ప్రతీ పొలీసు చాలా నేర్చుకోవాలని డీజీపీ గౌతం సవాంత్ అన్నారు.

విజయవాడ: పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి అని... వారి త్యాగం నుంచీ ప్రతీ పొలీసు చాలా నేర్చుకోవాలని డీజీపీ గౌతం సవాంత్ అన్నారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవ పరేడ్లో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ దళాలు భారతదేశాన్ని రక్షించడానికి పనిచేస్తారన్నారు. ప్రతీ సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారి త్యాగాలను గుర్తుంచుకోవడానికి అని ప్రధాని మోదీ చెపుతారని ఆయన అన్నారు.
మొత్తం పోలీసు దళాలు దేశ సేవ కోసం పని చేస్తున్నాయని చెప్పారు. కోవిడ్ - 19 విపత్తులో ప్రతీ పోలీసు ముందుండి పనిచేసారని... అలాగే అన్లాక్డౌన్ తరువాత కూడా వెనుకాడని ధైర్యంతో పని చేసారని డీజీపీ పేర్కొన్నారు. మరణించిన పోలీసులకు సీఎం జగన్ 50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని.. అలాగే భీమా సదుపాయం కల్పించడం కూడా తమకు అత్యుత్తమ సదుపాయమన్నారు. స్పందన చాలా ఉపయోగకరంగా మారిందని తెలిపారు. మహిళా భద్రతకు వినూత్న విధానాలు తీసుకొచ్చామని అన్నారు. 87 పోలీసు సేవలతో కూడిన పోలీసు సేవా యాప్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని... ఎలాంటి క్లిష్టమైన పరిస్ధితులైన ఏపీ పోలీసు ముందుంటారని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.