ఏపీలో వర్షాలు...రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2020-11-26T13:56:54+05:30 IST

నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఏపీలో వర్షాలు...రైతుల ఆందోళన

అమరావతి: నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వాతావరణంలోని మార్పులు, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు రైతాంగం దెబ్బతిన్నది. ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎకరాకు 15 నుంచి 25 బస్తాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మళ్లీ వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-11-26T13:56:54+05:30 IST