నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-11-26T12:58:37+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

అమరావతి:  నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సత్యవేడులోని పలు మండలాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. 

Updated Date - 2020-11-26T12:58:37+05:30 IST