అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర
ABN , First Publish Date - 2020-12-16T00:43:11+05:30 IST
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ పాదయాత్ర నిర్వహించారు. 3 రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు.
విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ పాదయాత్ర నిర్వహించారు. 3 రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. అమరావతికి మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ నిరంకుశ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మహిళలు ఆక్షేపించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి శనివారం నుంచి 17 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు చెప్పారు. 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనం, 15న విజయవాడలో పాదయాత్ర, 17న ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాజధాని అమరావతి రక్షణ కోసం జనభేరి పేరుతో ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించాని నిర్ణయించారు. రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ స్థలంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది అవుతుండడంతో సభ నిర్వహిస్తున్నారు. సభలో రైతులు, వివిధ పార్టీల నేతలు భారీగా పాల్గొననున్నారు.