మూడు రాజధానులతో అన్యాయం
ABN , First Publish Date - 2020-07-10T09:46:43+05:30 IST
‘అమరావతిని కొనసాగిస్తామని చెప్పారు. మధ్యలో మడమ తిప్పి మూడు రాజధానులు తీసుకొచ్చారు.

205వ రోజు ఆందోళనల్లో రైతుల ఆవేదన
తుళ్లూరు, జూలై 9 : ‘అమరావతిని కొనసాగిస్తామని చెప్పారు. మధ్యలో మడమ తిప్పి మూడు రాజధానులు తీసుకొచ్చారు. భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేశారు.’ అని రాజధాని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారానికి 205వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని, అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధానిలో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న అమరావతి జీవన భృతి పింఛన్‌ను రూ.5వేలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన జగన్ పదవి చేపట్టాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.