నమ్మించి మోసం చేయొద్దు

ABN , First Publish Date - 2020-07-28T09:52:13+05:30 IST

రాజధాని అమరావతిపై నమ్మించి మోసం చేయవద్దంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నమ్మించి మోసం చేయొద్దు

తుళ్లూరు, తాడికొండ, జూలై 27: రాజధాని అమరావతిపై నమ్మించి మోసం చేయవద్దంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 223వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతి ఉండాలని చెప్పిన ప్రస్తుత పాలకులు, దానిని విస్మరించి మూడు రాజధానులను తెరపైకి తేవడం నమ్మించి ద్రోహం చేయడమేనన్నారు. అమరావతిని నిర్వీర్యం చేయవద్దని, మూడు రాజధానులు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు. మందడం, నేలపాడు, పెదపరిమి, తుళ్లూరు, దొండపాడు, బోరుపాలెం అనంతరవం, నెక్కల్లు, మందడం, వెంకటపాలెం తదితర రాజధాని గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు రైతులు, మహిళలు సోమవారం నిరసనలు తెలిపారు.

Updated Date - 2020-07-28T09:52:13+05:30 IST