రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో ఆగిన మరో గుండె
ABN , First Publish Date - 2020-12-30T16:45:31+05:30 IST
అమరావతి రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో గుండె ఆగింది.
అమరావతి: అమరావతి రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో గుండె ఆగింది. తుళ్లూరు మండలం మందడంలో మాదాల రామారావు(80) గుండెపోటుతో మృతి చెందాడు. అమరావతి నిర్మాణానికి రామారావు 20ఎకరాలు ఇచ్చాడు. రాజధాని తరలిపోతోందని గత కొంతకాలంగా మనోవ్యధతో బాధ పడుతున్నారని రామయ్య కుటుంబసభ్యులు తెలిపారు.