ఏపీలో ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావు: బుచ్చిరాంప్రసాద్

ABN , First Publish Date - 2020-12-26T17:16:53+05:30 IST

రాష్ట్రంలో ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావని ఇండో అమెరికన్‌ బ్రాహ్మణ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ బుచ్చిరాంప్రసాద్ అన్నారు.

ఏపీలో ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావు: బుచ్చిరాంప్రసాద్

అమరావతి: రాష్ట్రంలో ఒక మతాన్ని కించపరిచే చర్యలు సరికావని ఇండో అమెరికన్‌ బ్రాహ్మణ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ బుచ్చిరాంప్రసాద్ అన్నారు. హిందూ ఆచారాలపై కుట్రపూరితంగా దాడి జరుగుతోందని మండిపడ్డారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి రోజూ హిందూ దేవాలాయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుమలపై కొండపై మంత్రుల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపడమే కాకుండా... డ్రోన్‌లు ఎగురవేసి తిరుమల నిబంధనలు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శాంతిభద్రతలకు విఘాతం కాదా?... దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారన్నారు. రోడ్లపైకి రాకపోయినా సరైన సమయంలో బుద్ధి చెబుతారని బుచ్చిరాంప్రసాద్ హెచ్చరించారు. 

Updated Date - 2020-12-26T17:16:53+05:30 IST