ఏపీ మండలి చైర్మన్‌కు టీడీపీ శాసనమండలి సభ్యుల లేఖ

ABN , First Publish Date - 2020-11-27T14:51:03+05:30 IST

శాసనమండలి శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను, స్వల్పకాలిక చర్చకు అనుమతించాలంటూ ఏపీ శాసనమండలి చైర్మన్‌కు టీడీపీ శాసనమండలి సభ్యులు లేఖ రాశారు.

ఏపీ మండలి చైర్మన్‌కు టీడీపీ శాసనమండలి సభ్యుల లేఖ

అమరావతి: శాసనమండలి శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను,  స్వల్పకాలిక చర్చకు అనుమతించాలంటూ ఏపీ శాసనమండలి చైర్మన్‌కు టీడీపీ శాసనమండలి సభ్యులు లేఖ రాశారు. సభ్యుల హక్కలను కాపాడాలని శాసనమండలి చైర్మన్‌ను కోరారు. టీడీపీ శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్‌బాబు, బుద్దా వెంకన్న, మంతెన వెంకట సత్యనారాయణ రాజు ఈ లేఖను రాశారు. సభను సజావుగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ పేరుతో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేతలు విమర్శించారు. ప్రజా సమస్యలను లేవదీసి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రశ్నోత్తరాల సమయానికి అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. 

Read more