మోదీ ఏది చెబితే అది చేసేలా ఉంది ప్రభుత్వం: రవీంద్రనాథ్

ABN , First Publish Date - 2020-11-26T17:38:18+05:30 IST

నరేంద్ర మోదీ ఏది చెబితే అది చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాధ్ విమర్శించారు.

మోదీ ఏది చెబితే అది చేసేలా ఉంది ప్రభుత్వం: రవీంద్రనాథ్

అమరావతి: నరేంద్ర మోదీ ఏది చెబితే అది చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు  రవీంద్రనాధ్ విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులకు మేలు చేస్తామని జగన్ హామీ ఇచ్చి, వాటిని అమలు చేయడంలేదని... కనీసం ఉద్యోగ భద్రత కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సంఘటితంగా ఉన్న కార్మికుల మధ్య మనస్పర్ధలు తీసుకువచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో జోరున వర్షం ఉన్నప్పటికీ అందరూ సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిషత్‌లో కార్మికుల హక్కల కోసం పోరాటం చేస్తామని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-11-26T17:38:18+05:30 IST