309వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

ABN , First Publish Date - 2020-10-21T12:51:34+05:30 IST

రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 308వ రోజుకు చేరుకున్నాయి.

309వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 308వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం,ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు  కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. 

Updated Date - 2020-10-21T12:51:34+05:30 IST