నవంబర్ 1న విజయవాడలో మహా ధర్నా: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-10-20T00:13:45+05:30 IST
నవంబర్ 1న విజయవాడలో మహా ధర్నా: శైలజానాథ్

అమరావతి: వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్ శైలజానాథ్ మండిపడ్డారు. అమరావతి, కోర్టు వంటి అంశాలను మంత్రుల భాషాప్రావీణ్యంతో పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మానస పుత్రుడన్నారు. వైసీపీకి బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ అని పేర్కొన్నారు. ఈ నెల 31న రైతులకు మద్దతుగా జిల్లా కేంద్రాల్లో కిసాన్ దివస్ నిర్వహిస్తామని తెలిపారు. వెనుకబడిన వర్గాలపై దాడులకు నిరసనగా నవంబర్ 1న విజయవాడలో మహా ధర్నా చేపడతామన్నారు.