16న ఏపీలో పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు

ABN , First Publish Date - 2020-10-03T19:07:03+05:30 IST

ఈ నెల 16 ఏపీలోని పలు ప్రాజెక్ట్‌లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చ్యువల్‌గా శంఖుస్తాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

16న ఏపీలో పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు

అమరావతి: ఈ నెల 16 ఏపీలోని పలు ప్రాజెక్ట్‌లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చ్యువల్‌గా శంఖుస్తాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. దాదాపు రూ.7,584 కోట్ల విలవ చేసే 16 ప్రాజెక్ట్‌లకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.8,038 కోట్ల విలువ చేసే పది ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం రూ.15,622 కోట్ల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన జరుగనుంది. ఈ నెల 16న దుర్గగుడి ఫ్లైఓవర్‌ను కూడా వర్చ్యువల్‌గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-10-03T19:07:03+05:30 IST