94వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు

ABN , First Publish Date - 2020-03-21T10:14:39+05:30 IST

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో భయపడుతుంటే.. రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఉద్యమంలో మాత్రం స్ఫూర్తి సడలలేదు.

94వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో భయపడుతుంటే.. రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఉద్యమంలో మాత్రం స్ఫూర్తి సడలలేదు. కొవిడ్‌ వైరస్‌ కంటే ప్రమాదకరమైన పాలకుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రాణాలకు తెగించైనా అమ్మలాంటి అమరావతిని కాపాడుకుంటామంటూ దీక్షా శిబిరాల్లో నిర్భయంగా కూర్చుంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే పోరాటానికి ఊపిరిలూదుతున్నారు. అమరావతి పరిరక్షణార్థం చేపట్టిన ఉద్యమాలు శుక్రవారం 94వ రోజూ కొనసాగాయి. 

Updated Date - 2020-03-21T10:14:39+05:30 IST