నట్టేట ముంచొద్దు!

ABN , First Publish Date - 2020-03-04T08:48:02+05:30 IST

‘రాష్ట్ర ప్రజల కోసం.. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం విలువైన భూములను త్యాగం చేసిన మమ్మల్ని నట్టేట ముంచొద్దు..’

నట్టేట ముంచొద్దు!

కృష్ణానదిలో రాయపూడి రైతులు, మహిళల జలదీక్ష

77వ రోజూ కొనసాగిన రాజధాని రైతుల దీక్ష

మందడంలో భారీగా పోలీసులు

సీఎం వస్తున్నారంటూ బలవంతంగా శిబిరం ఖాళీ 


‘రాష్ట్ర ప్రజల కోసం.. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం విలువైన భూములను త్యాగం చేసిన మమ్మల్ని నట్టేట ముంచొద్దు..’ అంటూ రాజధాని రైతులు, మహిళలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో అమరావతిని అభివృద్ధి చేస్తామని మాటిచ్చి.. నేడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా సుదీర్ఘ పోరు సాగిస్తున్న రాజధాని రైతులు మంగళవారం 77వ రోజు కూడా తమ నిరసనలను కొనసాగించారు. రాయపూడి రైతులు కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. కాగా సీఎం జగన్‌ సచివాలయానికి వస్తున్నాడనే కారణంతో పోలీసులు మందడం దీక్ష శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించడంపై పలువురు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - 2020-03-04T08:48:02+05:30 IST