-
-
Home » Andhra Pradesh » Krishna » amaravathi deekshalu
-
ఇన్‌సైడర్ పేరుతో రాజకీయాలా?
ABN , First Publish Date - 2020-12-19T05:58:28+05:30 IST
ఇన్‌సైడర్ పేరుతో రాజకీయాలా?

367వ రోజు దీక్షల్లో ప్రభుత్వంపై రాజధాని రైతుల ఆగ్రహం
తుళ్లూరు/మంగళగిరి/తాడేపల్లి/తాడికొండ, డిసెంబరు 18 : అమరావతిలో రైతులకు ఇష్టమై భూములు అమ్ముకుంటే దానికి ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని పాలకులు రాజకీయాలు చేస్తున్నారని రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని చేస్తున్న ఉద్యమం శుక్రవారానికి 367వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాళ్లాయపాలెంలో మూడు రాజధానుల శిబిరాన్ని శుక్రవారం మంత్రి కొడాలి నాని, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ సందర్శించి సంఘీభావం చెప్పడం సిగ్గుచేటన్నారు. అమరావతి కోసం ఏడాది నుంచి పోరాడుతున్న దంపతులకు తానా మాజీ అఽధ్యక్షుడు కోమటి జయరాం మిత్రబృందం శుక్రవారం పాదపూజ చేసింది. అన్ని గ్రామాల్లోని రైతు దంపతులకు ఈ పాదపూజ చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాకలో రైతుల దీక్షలు 367వరోజుకు చేరుకున్నాయి.