ఏడాదికే ట్రైలర్ కనిపిస్తే.. మరో 4 ఏళ్లకు క్లైమాక్సే: ఆమంచి

ABN , First Publish Date - 2020-05-30T19:16:58+05:30 IST

సీఎం జగన్ ఏడాది పాలనలో చంద్రబాబుకి ట్రైలర్ కనిపించిందని.. మరో నాలుగేళ్ల పాలనలో చంద్రబాబుకి క్లయిమాక్స్

ఏడాదికే ట్రైలర్ కనిపిస్తే.. మరో 4 ఏళ్లకు క్లైమాక్సే: ఆమంచి

ప్రకాశం: సీఎం జగన్ ఏడాది పాలనలో చంద్రబాబుకి ట్రైలర్ కనిపించిందని.. మరో నాలుగేళ్ల పాలనలో చంద్రబాబుకి క్లయిమాక్స్ కనపడుతుందని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మంగళగిరిలో లోకేష్‌ని గెలిపించుకోలేకపోయారన్నారు. లోకేష్‌ని అసెంబ్లీకి పంపాలంటే జగన్ కాళ్లు పట్టుకుని... వైసీపీ టిక్కెట్ అడగాల్సిన పరిస్థితి నాలుగేళ్లలో చంద్రబాబుకి వస్తుందని చెప్పారు. గతంలో మంత్రి పదవులు ఆశ చూపి వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. ఇప్పుడు వైసీపీ సభ్యత్వం కోసం టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారని ఆమంచి స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-30T19:16:58+05:30 IST