-
-
Home » Andhra Pradesh » Krishna » agri new seeds
-
కొత్త వంగడాల సామర్థ్యంపై శాస్త్రవేత్తల పరిశీలన
ABN , First Publish Date - 2020-11-21T06:14:14+05:30 IST
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ వరి పరిశోధన స్థానాల్లో రూపొందించిన నూతన వరి వంగడాల ప్రదర్శనను శాస్త్రవేత్తలు శుక్రవారం పరిశీలించారు.

మోపిదేవి, నవంబరు 20 : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ వరి పరిశోధన స్థానాల్లో రూపొందించిన నూతన వరి వంగడాల ప్రదర్శనను శాస్త్రవేత్తలు శుక్రవారం పరిశీలించారు. పెదప్రోలు పంచాయతీ శివారు శివరామపురం గ్రామంలో నూతన వంగడాలైన ఎంపీయూ 1318, 1315, 127, బీపీటీ 2766 రకాలను ప్రదర్శనలో ఉంచారు. ఆయా రకాల దిగుబడి సామర్థ్యం, చీడపీడలు తట్టుకునే శక్తి, పలు అంశాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖాధికారులు పరిశీలించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం గుంటూరు సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ వై.పద్మలత, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్, బాపట్ల శాస్త్రవేత్త డాక్టర్ వై.సునీత, మండల వ్యవసాయ శాఖాధికారి వి.శివనాగరాణి తదితరులు పాల్గొన్నారు.