మీటర్ రీడర్ల ధర్నా
ABN , First Publish Date - 2020-12-20T05:58:58+05:30 IST
మీటర్ రీడర్ల ధర్నా

మచిలీపట్నం టౌన్, డిసెంబరు 19: బకాయిలు చెల్లించాలని, పూర్తి స్థాయిలో మీటర్ రీడర్లకు వేతనాలు చెల్లించాలంటూ శనివారం మచిలీపట్నం ఎలక్ర్టికల్ డీఈ కార్యాలయం వద్ద మీటర్ రీడర్లు ధర్నా చేశారు. ఈ ధర్నాకు బొర్రా శ్రీనివాసరావు, రంజిత్ తదితరులు నాయకత్వం వహించారు. మెరుగుమాల రామకృష్ణ మాట్లాడుతూ.. 20 ఏళ్ల నుంచి ఎనిమిది గ్రామాల్లో మీటరు రీడింగ్ చేస్తున్నానని, తనకు రూ. 8వేలు వచ్చే గౌరవ వేతనం వచ్చేదని, రూ. 6వేల కంటే ఎక్కువ ఇవ్వబోమని కాంట్రాక్టర్ చెబుతున్నాడన్నారు. పెదముత్తేవి, కోసూరు గ్రామాల్లో మీటర్ రీడింగ్ తీసే గోవాడ గోవిందరాజు తనకు గతంలో రూ. 10వేలు వచ్చేవని, ఇప్పుడు రూ. 7500కు మించి రావడం లేదన్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాలకు ఒకే కాంట్రాక్టర్ ఉన్నారన్నారు. కృష్ణాజిల్లాలో ఉండే మీటర్ రీడర్లందరూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏపీసీపీడీసీఎల్ డీఈ ఎం.సాంబశివరావు, ఏడీలు డి. వెంకటకృష్ణారెడ్డి, ఎ. సుందరరాజుతో మీటర్ రీడర్లు చర్చలు జరిపారు. కాంట్రాక్టరుతో మాట్లాడతానని డీఈ చెప్పి వారిని ఇంటికి పంపారు.