-
-
Home » Andhra Pradesh » Krishna » Accident
-
రహదారిపై గుంతలో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-10T05:52:48+05:30 IST
మండలంలోని చంద్రాల వద్ద రహదారిపై పడిన గుంత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిశాయి.

మైలవరం రూరల్ : మండలంలోని చంద్రాల వద్ద రహదారిపై పడిన గుంత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిశాయి. కంచికచర్లకు చెందిన కొత్త నరసింహారావు (40) వ్యక్తిగత పనులతో మోటార్ బైక్‌పై నూజివీడు వెళు తున్నాడు. చంద్రాల వద్ద రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి రోడ్డుపై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై పి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.