రియల్టర్ల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2020-09-29T20:15:53+05:30 IST

మాజీ అదనపు కలెక్టర్ నగేష్ కేసులో విచారణ కొనసాగుతోంది.

రియల్టర్ల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: మాజీ అదనపు కలెక్టర్ నగేష్ కేసులో విచారణ కొనసాగుతోంది. మంగళవారం ఏసీబీ అధికారులు వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్ మండలాల్లో రియల్టర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మాసాయిపేట గ్రామంలో దళితులకు సంబంధించిన ఇనాం భూములను అతి తక్కువ ధరకే వారి వద్ద నుంచి కలెక్టర్ నగేస్ కొనుగోలు చేసినట్లు తెలియవచ్చింది. శివరాజ్ అనే బ్రోకర్ ద్వారా భూమి సమీకరించి 20 మంది దళితుల నుంచి మూడున్నర ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు రైతులను పిలిపించి మాట్లాడుతున్నారు. బ్రోకర్ శివరాజ్‌ను కూడా అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2020-09-29T20:15:53+05:30 IST