10,887 మంది డిశ్చార్జి.. 265 కొత్త కేసులు.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-08-22T16:36:00+05:30 IST

10,887 మంది.. ఇది కరోనా బాధితుల సంఖ్య కాదు.. వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య. మొత్తం బాధితుల సంఖ్య 13,501 ఉండగా, 10,887 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

10,887 మంది డిశ్చార్జి.. 265 కొత్త కేసులు.. ముగ్గురి మృతి

ఇంకా చికిత్స పొందుతున్నవారు 2,374 మంది

24 గంటల్లో 355 మంది రికవరీ


విజయవాడ, ఆంధ్రజ్యోతి: 10,887 మంది.. ఇది కరోనా బాధితుల సంఖ్య కాదు.. వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య. మొత్తం బాధితుల సంఖ్య 13,501 ఉండగా, 10,887 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 2,374 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు తగ్గడం, డిశ్చార్జి కేసులు పెరగడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 355 మంది డిశ్చార్జి కాగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 265గా నమోదైంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు బాధితులు మరణించారు. దీంతో మరణాలు అధికారికంగా 240కు పెరిగాయి. 

Updated Date - 2020-08-22T16:36:00+05:30 IST