కాల్వలో పడి యువకుడి మృతి, మరొకరి గల్లంతు

ABN , First Publish Date - 2020-09-17T11:07:14+05:30 IST

వేర్వేరు ఘటనలో ప్రమావశాత్తు కాల్వలో పడి యువకుడు మృతి చెందగా, మారో యువకుడు గల్లంతయ్యాడు. కోసూరు చినదళితవాడకు చెందిన బొంతు క్రాంతి కుమార్‌ (22) తన తండ్రితో కలసి

కాల్వలో పడి యువకుడి మృతి, మరొకరి గల్లంతు

కూచిపూడి : వేర్వేరు ఘటనలో ప్రమావశాత్తు కాల్వలో పడి యువకుడు మృతి చెందగా, మారో యువకుడు గల్లంతయ్యాడు. కోసూరు చినదళితవాడకు చెందిన బొంతు క్రాంతి కుమార్‌ (22) తన తండ్రితో కలసి   పొలం వెళ్లి కాల్వలో అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను తొలగిస్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఎంత గాలించినప్పటికీ క్రాంతికుమార్‌ ఆచూకీ లభ్యం కాలేదు.


కళ్లెదుట కుమారుడు గల్లంతు కావటంతో తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు క్రాంతికుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాలంకిపాడుకు చెందిన తూముపాటి మురళి (33) పొలం చూసేందుకు వెళ్లి కాలు జారి పంటకాలువలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కూచిపూడి ఎస్సై జి.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-17T11:07:14+05:30 IST