దేవినేని నెహ్రూకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-06-23T09:23:45+05:30 IST

మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ) 66వ జయంతి వేడుకలు సోమవారం గుణదలలోని దేవినేని రాజశేఖర్‌ ఘాట్‌ వద్ద జరిగాయి.

దేవినేని నెహ్రూకు ఘన నివాళి

గుణదల, జూన్‌ 22 : మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ) 66వ జయంతి వేడుకలు సోమవారం గుణదలలోని దేవినేని రాజశేఖర్‌ ఘాట్‌ వద్ద జరిగాయి. ఘాట్‌ వద్దకు చేరుకున్న వైసీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌, సీనియర్‌ నాయకులు కడియాల బుచ్చిబాబు.. నెహ్రూకు ఘన నివాళుల ర్పించారు. నాయకులు వెంకట సత్యనారాయణ, ఆళ్ల చెల్లారావు, కలపాల అంబేడ్కర్‌, కొరివి చైతన్య(వర), పర్వతనేని బాబీ, తిరుమల రాజ్‌కుమార్‌, సొంగా రాజ్‌కమల్‌, దండమూడి రాజేష్‌, శెటికం దుర్గ, వినిత్‌ పాల్గొన్నారు.  

Read more